జీతెలుగు సీరియల్స్ ప్రోమోలలో మహేష్ బాబు

Screengrab Twitter:

సీరియల్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో జీ తెలుగు సిరీయల్ ప్రోమోల్లో మహేష్ కనిపించనున్నట్లు ఈ మేరకు జీ తెలుగు నిర్వహకులు ప్రకటించారు. గతంలో జీతెలుగుతో మహేష్ బాబు చేసుకున్న ఒప్పందం మేరకు ప్రచారం చేయనున్నారు. దీంతో మహేష్ బాబు జీ తెలుగు కోసం కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొననున్నాడు. ఈ అగ్రిమెంట్ ఏడాదిపాటు ఉంటుందని, పరిస్థితిని బట్టి పొడిగించవచ్చని జీ తెలుగు ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రచార కార్యక్రమంలో మహేష్ కూతురు సితార కూడా భాగం కానున్నట్లు తెలిసింది.

Exit mobile version