సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన ‘కళావతి’ సాంగ్ ఇప్పుడు రికార్డు సృష్టించింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు పాటగా నిలిచింది. అటు తాజాగా విడుదలైన పెన్ని సాంగ్ కూడా దూసుకెళ్తుంది.