సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతడి సతీమణి నమ్రతా శిరోద్కర్ ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ ను కలుసుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ బాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఫారన్ టూర్ లో ఉన్న మహేశ్ బిల్ గేట్స్ ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. తాను చూసిన గొప్ప విజనరీల్లో బిల్ గేట్స్ ఒకరని మహేశ్ రాసుకొచ్చారు.