మహేశ్-త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనట

© File Photo

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక పూర్తయింది. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ మహేశ్ కు వినిపించగా.. ఆయన చాలా బాగుందని అన్నారట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై రెండో వారం నుంచి మొదలుకానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.. కానీ ఈ వార్త విని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version