మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాను చూసేందుకు మాత్రం రూ. 199 కట్టాల్సి ఉంటుందని అమెజాన్ తెలిపింది. సినిమాను చూడడం మొదలుపెట్టిన 48 గంటల్లోగా చూసేయాలి. ఈ మూవీ థియేటర్లలో మే 12న విడుదలయింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నా కానీ రూ. 199 కట్టాల్సిందే అని ప్రైమ్ స్పష్టం చేసింది.