టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా హాజరైన మహేష్…ఈ టీమ్‌ని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. సినిమా చూసానని, చివరి ముప్పై నిమిషాలు చూస్తుంటే ఆ భావోద్వేగాలతో తన గొంతు ఎండిపోయిందని చెప్పారు. ఆ క్రమంలో బయటకు వచ్చి అడవి శేష్‌ని గట్టిగా కౌగిలించుకున్నానని మహేష్ గుర్తు చేశారు. తాను మొదట ఈ మూవీ కథ విన్నప్పుడు, ఇది చెప్పాల్సిన స్టోరీ అని తెలుసని అన్నారు. కానీ ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు ఈ టీమ్‌కి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.