‘సర్కారు వారి పాట’ సినిమాకు లీకుల బెడద తప్పేట్లు లేదు. ఇటీవలే కళావతి సాంగ్ లీక్ కావడంతో ఒకరోజు ముందుగానే పాటను విడుదల చేయాల్సి వచ్చింది. కళావతి పాట హిట్ కావడంతో అది రాసిన లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి రివీల్ చేశారు. ఎవరు లేని ఒక అనాథ, ఎప్పుడు గొడవలు పడుతుండే వ్యక్తి ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడితే ఆ ప్రేమను ఎలా తెలియజేస్తాడో చెప్పేలా కళావతి సాంగ్ రాశానని వివరించాడు. దీంతో సినిమలో మహేశ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందని ముందే ఇలా చెప్పేస్తే మూవీపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.