సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా ప్రముఖ పీకాక్ మ్యాగజైన్ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మా నాన్న నటించిన అల్లూరి సీతారామరాజు అని చెప్పాడు. ఇక నేను డైరెక్టర్ అయితే ఒక్కడు సినిమాను రీక్రియేట్ చేయాలనుకుంటున్నా అన్నాడు. నా డైరెక్టర్ల అంచనాలను అందుకోలేనేమో అనేది నాకు అతిపెద్ద భయం అని చెప్పాడు. ఇంకా ఇటువంటి చాలా ప్రశ్నలకు మహేశ్ చెప్పిన సమాధానాలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.