భారత మార్కెట్లోకి మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు విడుదలైంది. రెండు వేరియంట్లలో ఈ వాహనం అందుబాటులోకి వచ్చింది. 34.5 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యమున్న EC కారు 375 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. మరో వేరియంట్ 39.4 కిలోవాట్ బ్యాటరీ గల EL వాహనం 456 కిలోమీటర్ల దూరం వెళ్లగలదని కంపెనీ తెలిపింది. 8.3 సెకన్లలో ఈ వాహనం గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని సంస్థ వెల్లడించింది. ధరలు: XUV 400 EC(3.3kw CHARGER)- 15.99L; XUV 400 EC(7.2kw CHARGER)- 16.49; XUV 400 EL(7.2kw CHARGER)- 18.99 లక్షలుగా ఉంది. జనవరి 26నుంచి బుకింగ్స్ ప్రారంభం.