అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ మూవీ అరుదైన ఘనతను అందుకుంది. ఈ మూవీ రిలీజయిన ప్రతి చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీని రిలీజ్ కు ముందే ఈ మూవీ ప్రివ్యూ షోస్ ప్రదర్శించారు. అయినా కానీ ఈ మూవీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. ఈ ప్రివ్యూ షోల ద్వారా మేజర్ అరుదైన ఘనతను అందుకుందని మూవీ టీం ప్రకటించింది. మొత్తం దేశవ్యాప్తంగా 88 ప్రివ్యూ షోలను ప్రదర్శించగా.. ప్రతి షో హౌస్ ఫుల్ అయిందట. ఇంత వరకు ఏ మూవీ ప్రీమియర్ కూడా ఇలా హౌస్ ఫుల్ కాలేదని తెలియజేసింది.