ఎప్పుడైనా హీరోలు సినిమా టెక్కెట్లు కోసం క్యూ లైన్లో నిలబడటం చూశారా. అవును మీరు విన్నది నిజమే. ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ టిక్కెట్ల కోసం క్యూ లెన్లో నిలబడ్డారు. అయితే తన సర్కారు వారి పాట మూవీ చూడటానికి కాదు. మేజర్ చిత్రం చూసేందుకు లైన్లో వేచి ఉన్నారు. మరో హీరో అడవి శేష్ లైన్ లో ఉండగా, మహేష్ మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. ఈ చిత్రాన్ని మహేష్ నిర్మించగా, సరికొత్తగా నిహారిక ఎన్ఎం ప్రమోట్ చేస్తున్నారు. జూన్ 3న పలు భాషల్లో మేజర్ మూవీ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా వీడియో చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.