మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే దేశం కోసం పోరాడిన వీరుడి గురించి విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘మేజర్’ చిత్ర యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు కేవలం 50శాతం టికెట్ చార్జీతో సినిమా చూడొచ్చని తెలిపింది. పాఠశాల యాజమాన్యాలు majorscreening@gmail.com కి మెయిల్ చేస్తే మేజర్ టీం ఆ పాఠశాలకు ప్రత్యేక షో ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.