అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జులై 3 నుంచి మేజర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ముంబయి ఉగ్రదాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేజర్ పాత్రలో అడివి శేష్ నటనకు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభించాయి. బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభిత దూలిపాళ్ల కీలక పాత్రలో కనిపిపంచింది. శశికరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతానికి కూడా ప్రశంసలు దక్కాయి.
News Telangana Videos
తెలంగాణ బడ్జెట్‌పై విమర్శలకు హరీశ్ కౌంటర్