కేంద్ర నిరంకుశ విధానాలు, దర్యాప్తు సంస్థల వేధింపులను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని తెరాస ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రస్తావించడం ద్వారా దేశమంతా భాజపా నైజం తెలియజెప్పాలని సూచించారు. అడగడుగునా అన్యాయం చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిపై గళమెత్తాలన్నారు. రాష్ట్రంపై విషం చిమ్ముతూ.. ఆంక్షలతో ప్రగతిని అడ్డుకుంటుందోన్నారు. దీనివల్ల ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు తెలిపారు.