బంగ్లాదేశ్‌తో రేపు జరగబోయే రెండో వన్డేకు జట్టులో అక్షర్ పటేల్‌కు చోటు కల్పించాలని మాజీ బ్యాటర్ వసీం జాఫర్ సూచించాడు. జట్టులో ఈ స్పిన్నర్‌కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ‘కుల్‌దీప్ సేన్ స్థానంలో అక్షర్‌కి అవకాశం ఇవ్వాలి. ప్రపంచకప్ సమరానికి మరో 20-25 మ్యాచులు బాకీ ఉన్న నేపథ్యంలో అక్షర్‌ని పరీక్షించాలి. భారత్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు స్వర్గధామం. కాబట్టి వారు విధ్వసం సృష్టించగలరు. సిరాజ్, చాహర్‌లకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే రెండో వన్డేలో తప్పకుండా అక్షర్‌కి చోటు కల్పించాలి’ అని జాఫర్ సూచించాడు.