‘మేకిన్ ఇండియా’ నినాదం భారత రైల్వే కోచ్ల తయారీలో ట్రెండ్ సృష్టిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలోనే రైల్వే కోచ్ల తయారీలో 91.6 శాతం వృద్ధి జరిగిందని వెల్లడించారు. 2014-15 మధ్య 3,731, 2018-19 మధ్య 6,076, 2021-22 మధ్య 7,151 రైల్వే కోచ్లు తయారు చేసినట్లు ఆయన వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే అభివృద్ధిలో దూసుకు వెళ్తోందని అభిప్రాయపడ్డారు.