సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గురించి ఓ బజ్ వినిపిస్తోంది. ఇందులో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ ఐటెమ్ బాంబ్ మలైకా అరోరాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా ఓకే చెప్పిందని టాక్. చిత్రంలో అన్నిహంగులు ఉండాలనే ఉద్దేశంతో మాటల మాంత్రికుడు ఐటెమ్ సాంగ్ క్రియేట్ చేశారని సమాచారం. మలైకా ఇప్పటికే మహేశ్ సరసన అతిథి చిత్రంలో ఆడిపాడింది. గబ్బర్ సింగ్‌లోని కెవ్వు కేకలోనూ డాన్స్‌తో అదరగొట్టింది.