TS: కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణోత్సవాన్ని భక్తితో తిలకించారు. ప్రభుత్వం తరఫున రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని మల్లన్న స్వామికి సమర్పించారు. మల్లన్న ఆలయానికి రూ.30కోట్లు సీఎం మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ గుర్తు చేశారు. వచ్చే ఏడాది మేడమ్మ, ఖేతమ్మలకు కూడా స్వర్ణ కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.