పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తంగలాన్’ చిత్రం నుంచి నటి మాళవిక మోహన్‌ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని చారిత్రక కథా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నటన దర్శకుడికి సంతృప్తి కలిగించడం లేదని సమాచారం. దీంతో పొరపాటున ఆమెను ఈ చిత్రానికి ఎంపిక చేశామా అని తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. చివరకు మాళవికను ఈ మూవీ నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల టాక్.