మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం తెరకెక్కించిన మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి ‘మమ మహేషా’ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేశారు. థమన్ మ్యూజిక్‌కి, మహేష్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. కీర్తి సురేష్, మహేష్ బాబు ఫుల్ మాస్ లుక్‌లో వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.