మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సూపర్‌స్టార్ మోహనల్‌లాల్ ‘లూసిఫర్’ నిలిచింది. 2019లో రిలీజైన ఆ మూవీ అప్పటిరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద గరిష్ఠ వసూళ్లను నమోదుచేసింది. అయితే తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ, మోహనల్లాల్ను బీట్ చేశాడు. మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ సినిమా కలెక్షన్లు వారం రోజుల్లోనే లూసిఫర్‌ను మించిపోయాయట. సినిమాకు పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు రావడంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు.