విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి విమానం రెక్కలపైకి నడిచాడు. కాలిఫోర్నియాకు చెందిన రాండీ ఫ్రాంక్ డేవిలా అనే 57 ఏళ్ల ఈ వ్యక్తిని చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. చికాగోలోని ఓ’హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ సిబ్బంది వ్యక్తిని విమానం వెలుపల ఆపారు. విమానం గేటు వద్దకు రాగానే ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోయారని ఎయిర్‌లైన్స్ ప్రకటనలో తెలిపింది.