మధ్యప్రదేశ్ లో హృదయం ద్రవించే విషాదకర ఘటన చోటుచేసుకుంది. దామో జిల్లా కేంద్రంలోని
ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఓ నాలుగేళ్ల చిన్నారి చనిపోతే… ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కనీసం అంబులెన్స్ కూడా దొరకలేదు. బస్సులో వెళ్దామన్నా ఎక్కనివ్వలేదు. దీంతో కడుపులో దుఃఖాన్ని దిగమింగుకుని.. చిన్నారిని భుజాలపైనే వేసుకుని మేనమామ మోసుకెళ్లాడు. 5కిలోమీటర్లు అలాగే నడిచి ఇంటికి తీసుకెళ్లాడు. ఘటనపై స్పందించిన డీఎంహెచ్ఓ విచారణకు ఆదేశించారు.