ఒక కుక్క తనపై పగబట్టినట్లు రోజూ కరుస్తుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చాడు ఒక వ్యక్తి. అది విని పోలీసులు ఆశ్ఛర్యపోయారు. మహబూబాబాద్ జిల్లా బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ అనే వ్యక్తి కుక్కపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కుక్క యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిచారు. ఇకపై కుక్క ఎవరినీ కరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అతడి చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా భరించాలని ఆదేశించారు.