హనీమూన్‌కి వెళ్లిన వ్యక్తి అక్కడే మృతిచెందడంతో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీకృష్ణ(27)కు గతేడాది పెళ్లైంది. ఈ క్రమంలో ఇటీవల హనీమూన్ కోసమని మలేషియా వెళ్లారు. అనంతరం ఇండోనేషియాలోని బాలికి వచ్చారు. సముద్ర భూగర్భంలోకి వెళ్లి చేపలను చూసేందుకు వంశీకృష్ణ డైవ్ చేశాడు. ఈ క్రమంలో సముద్రంలో గల్లంతయ్యాడు. గుండెపోటు రావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని డెత్ రిపోర్టులో తేలింది. కాగా, మృతదేహాన్ని తీసుకు రావడానికి బంధువులు బాలికి వెళ్లారు.