మద్యం మత్తులో నీళ్లు అనుకొని మందులో యాసిడ్ కలుపుకొని తాగేశాడో వ్యక్తి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్(29) గతనెల 18వ తేదీన మద్యం మత్తులో నీళ్లు అనుకోని మందులో యాసిడ్ కలుపుకొని తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మహేష్ నిన్న మృతి చెందినట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు.