గ్లాస్ బాటిల్లో టపాసులు కాల్చొద్దన్నందుకు ఓ యువకుడిని ముగ్గురు మైనర్లు కిరాతకంగా హత్య చేశారు. ముంబైలోని శివాజీనగర్‌లో ఒక బాలుడు గ్లాసు బాటిల్లో టపాసులు ఉంచి పేలుస్తుండగా సునీల్ నాయుడు అడ్డు చెప్పాడు. గ్లాసు పేలి గాజుముక్కలు గుచ్చుకుంటాయని బాలుడికి చెప్పి అడ్డుకున్నాడు. కోపంతో ఆ బాలుడు, మరో ఇద్దరితో కలసి అతనిపై దాడి చేసి కొట్టి, కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలు కావడంతో సునీల్ మృతిచెందాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఒకరు పరారీలో ఉన్నారు.