యూపీలోని మీరట్‌లో ఒక వ్యక్తి ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు కోసి చంపేశాడు . ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. టైలర్ షాప్‌లో పనిచేసే యోగేంద్ర, బ్యూటీ పార్లర్లో పనిచేసే సీమ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో మీరట్‌లోని ఒక అపార్ట్మెంట్లో గత మూడేళ్ల నుంచి కలిసే ఉంటున్నారు. అయితే ఆదివారం రాత్రి ఇద్దరి మద్య గొడవ రావడంతో సీమను కేబుల్ వైర్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ రాత్రి మొత్తం అతడు అదే ఇంట్లో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడికి గతంలోనే ఒక మహిళతో వివాహం అయిందని పోలీసులు వెల్లడించారు.