నేటి సమాజంలో వివాహేతర సంబంధాలతో జరిగే హత్యల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. నిర్మల్ లో కూడా సేమ్ ఇటువంటి ఘటనే జరిగింది. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ముంతాజ్ ఖాన్ అనే మహిళ నివాసంలో మహ్మద్ ఫయాజ్ అతడి భార్య కలిసి అద్దెకు ఉంటున్నారు. కానీ ఫయాజ్ భార్యతో ఇంటి యజమాని కొడుకు జుబేర్ ఖాన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలిసిన ఫయాజ్ పలుమార్లు జుబేర్ ను హెచ్చరించినా కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఓ రోజు ఫయాజ్ జుబేర్ ను కత్తెరతో గొంతుకోశాడని, అనంతరం ఫయాజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలియజేశారు.