కోట్లకు అధిపతైనా తన వ్యక్తిత్వంతో కోట్లమంది హృదయాలు గెలుచుకున్న రతన్ టాటా మరోసారి తన నిరాడంబరతను చాటారు. బాడీగార్డులు మందీ మార్బలం లేకుండా చిన్న నానో కారులో తాజ్ హోటల్ కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన అసిస్టెంట్ శంతను నాయుడు కారు నడపారు. కొంచెం కూడా ధన గర్వం లేని టాటా వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కొంతమందైతే నానో కారును లెజెండరీ కారుగా అభివర్ణిస్తూ..మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని కోరారు.