ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి.. తన భార్యతో ఫస్ట్ నైట్ కోసమని వయాగ్రా మాత్రలు తీసుకున్నాడు. కానీ తీసుకోవాల్సిన మోతాదు కంటే కూడా అతడు ఎక్కువగా తీసుకోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అతగాడు చేసిన నిర్వాకానికి దాదాపు 20 రోజుల పాటు అలాగే అంగస్తంభన కొనసాగింది. ఆసుపత్రిలో చేరిన అతడికి సర్జరీ చేసిన వైద్యులు తర్వాత ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. అతడికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ పార్ట్ లో ఎప్పటికీ టెన్షన్ ఉంటుందని తెలియజేశారు. ఇతడు పడక గదిలో చేసిన నిర్వాకానికి ఆ నవ వధువు ఇతగాడిని విడిచి వెళ్లిపోయింది. ఏ మందులైనా వాడే ముందు డాక్టర్లను తప్పకుండా సంప్రదించాలని ఎంత మంది చెప్పినా వినకపోతే ఇలాగే ఉంటుంది.