మంచు విష్ణు భార్య విరానికా కొత్త సంవత్సరంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. విరానికాకు ఇప్పటికే ‘మైసన్ అవా కిడ్స్ బ్రాండ్’, ‘ది కేక్ రూమ్’ బేకరీలు, ‘న్యూయార్క్ అకాడమీ ఇంటర్నేషన్ స్కూల్’ ఇలా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. తాజాగా ‘విరానికా బ్రైడల్ కలెక్షన్’ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్‌లో చేతితో ఎంబ్రాయిడరీ పట్టుచీరలు డిజైన్ చేస్తారు. ఈ చీరలు ఒక్కొక్కటి రూ.20 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. వీటిని నెలలపాటు కష్టపడి చేతితో అందంగా తయారు చేస్తారు. అందుకే వీటికి అంత ధర.
-
Screengrab Instagram: viranicaofficial -
Screengrab Instagram: https://www.instagram.com/p/CnuA2Y1P3Dk/?utm_source=ig_web_copy_link