మాండూస్ తుపాను తీవ్రమవుతున్న నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం నుంచి 16 విమానాలను రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం ఇవి చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ, తుపాను తీవ్రత నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ట్విటర్‌లో సూచించింది. మరోవైపు, తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పలు చోట్లు పాఠశాలలకు సెలవు ప్రకటించేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమాయత్తం చేశారు.