మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తిల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను కూడా మూసివేశారు. భారీ వర్షాలకు తిరుమల చుట్టుపక్కల ఉన్న డ్యామ్లు అన్నీ నిండుకుండల్లా మారాయి. తూపిలిపాలెం బీచ్ దగ్గర 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. అటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.