హైదరాబాద్‌లోని భరత్ నగర్ బ్రిడ్జ్‌పై మందుబాబులు వీరంగం సృష్టించారు. బైక్‌పై వెళ్తుండగానే బీర్లు తాగుతూ చిప్స్ తింటూ చాలా డేంజరస్‌గా డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. పోలీసులు ఎన్ని కఠిన నియమాలు పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇలాంటి ర్యాష్ డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. తాగుతూ ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ వారితో పటు తోటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు.