ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో నేడు రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ దశలో 10 జిల్లాలోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 92 మంది అభ్యర్థులు ఈ రోజు ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఈ 10 జిల్లాలు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్నాయి. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ చేపడుతున్నారు.