ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన మొదటి చిత్రం ‘పృథ్విరాజ్’. ఈ మూవీ జూన్ 3న రీలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మానుషి.. తనకు రామ్‌చరణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ చాలా నచ్చాడని చెప్పింది. అతడితో కలిసి నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్తో రామ్‌చరణ్‌కు బాలీవుడ్లో ఎంత క్రేజ్ పెరిగిపోయిదో అర్థమవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.