మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో కీలక నేతను చంపేశారు. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా అలియాస్ సంతోష్ ఎంతో కాలంగా మావోయిస్టులకు ముఖచిత్రంగా కొనసాగుతున్నాడు. 2013లో దర్భా లోయలో జరిగిన దాడులకు హిడ్మానే సూత్రధారి.