TS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైద్యసిబ్బందికి మావోయిస్టు నేతలు వార్నింగ్ ఇచ్చారు. చికిత్స కోసం వస్తున్న అమాయక ప్రజల నుంచి ఇష్టారీతిన డబ్బులు దండుకుంటున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి పేరుతో ప్రకటన విడుదల చేశారు. రోగుల రక్తాన్ని కొందరు వైద్యులు జలగల్లా పీల్చుతున్నారని ఆ లేఖలో మావోయిస్టు నేతలు ఆరోపించారు. భద్రాద్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.