తెలంగాణలోని యాదాద్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మార్చి 28న ఉదయం 11.55 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమైంది. విమాన గోపురంపై సీఎం సమక్షంలో మహా సంప్రోక్షణ చేపట్టారు. శ్రీ సుదర్శన చక్రానికి వేద పండితులు యాగ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. కన్నుల పండువగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రలతో సహా పలువురు హాజరయ్యారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత భక్తులకు సర్వ దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆలయ ప్రతినిధులు స్పష్టం చేశారు.