మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాలనే చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు..మధ్యలో కాస్త పుంజుకున్నా చివరికి నష్టాలతోనే ముగిశాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్, నిఫ్టీకి పరాభవం తప్పలేదు. సెన్సెక్స్ ఇవాళ 509.24 పాయింట్లు కోల్పోయి 56,598.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 148.80 పాయింట్లు దిగువకు పడిపోయి 16,858.60 వద్ద స్థిరపడింది.
వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
