మార్కమ్ నగరం వీధికి AR రెహమాన్ పేరు

Screengrab Twitter:

మ్యూజిక్ మ్యాస్ట్రో AR రెహమాన్ కెనడా నుంచి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. తన పేరు కెనడాలోని మార్కమ్ నగరంలోని ఓ వీధికి పెట్టారని ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇలా తన పేరు పెడతారని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని రెహమాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడి మేయర్ ఫ్రాంక్ స్కార్పిట్టి, కెనడా కౌన్సెలర్‌లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్, సహా కెనడా ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కెనడాలో నివసిస్తున్న ప్రజలందరూ శాంతి, శ్రేయస్సు, ఆనందం, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Exit mobile version