మ్యాట్రిమొనీ ద్వారా పరిచయం.. వెంటపడి మరీ పెళ్లి..పెళ్లికి ముందే అబ్బాయి నుంచి కోట్లు వసూలు..తీరా పెళ్లయ్యాక..నెలకే మొగుడిని ఇంటినుంచి గెంటేసింది. తన బాస్ తో కలిసి ఉంటూ ఇదేంటని అడిగితే రౌడీలతో బెదిరింపులకు దిగుతోంది. బర్కత్‌పురాకు చెందిన రవికి, మ్యాట్రిమొనీ ద్వారా రీనా గోర్లె పరిచయమైంది. ఈ సంబంధం ఓకే కాకపోయినా ఆమె వెంటపడి మరీ పెళ్లి చేసుకుంది. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేస్తున్నానంటూ పెళ్లికి ముందే ప్రచారం కోసం రూ.6.5కోట్లు తీసుకుంది. ఫిబ్రవరి 12న రవి – రీనాల పెళ్లి జరిగింది. పెళ్లైన నెలకే రీనా అసలు రంగు బయటపెట్టింది. బాస్ తో కలిసి ఉంటానంటూ నెలకే భర్తను ఇంటి నుంచి గెంటేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..విషయం వెలుగులోకి వచ్చింది.