సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువే. సోషల్ మీడియాలో ఆమె ఫోటో వచ్చిందంటే చాలు వైరల్ అయిపోతుంది. అయితే ఈ అందాల సుందరికి గ్రౌండ్లో ఓ వ్యక్తి ప్రపోజ్ చేశాడు. “కావ్యా..నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ ప్లకార్డు పట్టుకుని కూర్చున్నాడు. SA20 లీగ్‌లో పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్ కేప్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ దృశ్యం వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.