రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ మార్షల్ ఆర్ట్స్ సాధన మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు. టాలీవుడ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జానీ’ సినిమా ఈ క్రీడ నేపథ్యంలోనే తెరకెక్కింది. దీంతో ఆనాటి సంగతుల్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ ఫైర్ అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.