దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మాస్క్ ల వాడకం సర్వ సాధారణమైపోయాయి. ఒకరి నుంచి ఒకరికి కరోనా సంక్రమణను కొంత వరకు మాస్క్ లు తగ్గించగలుగుతాయి. ఈ నేపథ్యంలో క్రమంగా కోవిడ్ తగ్గముఖం పట్టినా మరో 3నెలల వరక ఫేస్ షీల్డ్ లు, మాస్క్ ధరించాల్సిందేనని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ల వల్ల ప్రజలు కోవిడ్ బారి నుంచి బయటపడుతున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో గత పదిరోజులుగా ఈ మహమ్మారి వల్ల చనిపోయిన కేసులు నమోదు కాకపోవడం ఊరట కలిగించే విషయమని తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఈ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.