‘గని’ కి దారుణ ప‌రాజ‌యం

Courtesy Instagram:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంట‌గా కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. వ‌రుణ్ తేజ్ కెరీర్లో అత్య‌ధిక బ‌డ్జెట్ తో బాక్సింగ్ బ్యాగ్రౌండ్ లో ఈ సినిమా రూపొందింది. దీంతో వ‌రుణ్ జిమ్ లో చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. అయితే, భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. మొద‌టిరోజు నుంచే నెగెటివ్ టాక్ రావ‌డంతో 4రోజుల్లో కేవలం 4.4కోట్లు షేర్ ను రాబట్ట‌గ‌లిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా దాదాపు రూ.27కోట్ల షేర్ రావాల్సి ఉంది.

Exit mobile version