నేపాల్‌లో భారీ భూకంపం

© ANI Photo

నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా జరిగిన ఆస్థి, ప్రాణ నష్టాల గురించి తెలియాల్సి ఉంది. కాగా ఈ భూకంపం ప్రభావంతో నేపాల్‌ సరిహద్దుల్లోని బీహార్‌కు చెందిన సీతామర్హి, ముజఫర్‌పూర్‌, భాగల్పూర్‌, అరారియా, సమస్తిపూర్‌లో కూడా భూమి కంపించింది అక్కడి స్థానికులు తెలిపారు.

Exit mobile version