TS: యూట్యూబ్‌లో ఒక్కో వీడియోను లైక్ చేస్తే రూ.50 చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పార్ట్ టైం ఉద్యోగం పేరుతో, అధిక రిటర్న్‌ల పేరుతో వల వేసి బాధితుల నుంచి రూ.75లక్షల వరకు దోచుకున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఓ మెసేజ్‌ని పంపించారు. తాము పంపించే యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం ద్వారా రూ.50 చెల్లిస్తామని ప్రకటించారు. తొలుత బాగానే ఇచ్చి ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయాలని నమ్మించారు. ఇలా ఇద్దరి వద్ద చెరో 25లక్షలు, మరొకరి వద్ద 10 లక్షలు, ఇతరుల నుంచి మరో 15లక్షలను దోచేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.