ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్స్. అయితే ఈ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సీట్ల కేటాయింపు పెరిగినప్పటికీ స్టూడెంట్స్ మాత్రం పెరగడం లేదు. అయితే 2019లో 10 లక్షల నుంచి 2021లో 6.5 లక్షలకు జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్‌లు తగ్గాయి. ఇక కాలేజీ లొకేషన్ ఎంపిక విషయం, పరీక్ష కఠినమనే వాదన కూడా ఉంది. మరోవైపు దక్షిణ ప్రాంత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం కంటే, తమ ప్రాంతంలోని కళాశాలల్లో చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.